అమర్‌‌‌‌ నాథ్ యాత్రకు ఎయిర్‌‌‌‌టెల్ కనెక్టివిటీ

అమర్‌‌‌‌ నాథ్ యాత్రకు ఎయిర్‌‌‌‌టెల్ కనెక్టివిటీ

హైదరాబాద్​, వెలుగు: టెలికం ఆపరేటర్​ ఎయిర్‌‌‌‌టెల్ అమర్‌‌‌‌నాథ్ యాత్ర  పొడవునా మొబైల్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. యాత్రికులు, భద్రతా సిబ్బంది,  అధికారుల కోసం కనెక్టివిటీని బలోపేతం చేసింది. చందన్‌‌‌‌వారి, పిస్సు టాప్, బేతాబ్ వ్యాలీ వద్ద టవర్లను నిర్మించి కీలకమైన పహల్గామ్ మార్గంలో నెట్‌‌‌‌వర్క్ కవరేజీని విస్తరించింది. 

బాల్తాల్ వద్ద ఉన్న నెట్‌‌‌‌వర్క్‌‌‌‌తో పాటు ఈ కొత్త సైట్లు అమర్​నాథ్ గుహ ఆలయానికి వెళ్లే మార్గంలో నిరంతరాయ కనెక్టివిటీని అందిస్తాయి. యాత్ర సమయంలో కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అధికారులు, స్థానిక యంత్రాంగం సహకరించాయి. మెరుగైన కవరేజీ నమ్మకమైన వాయిస్, డేటా సేవలను అందిస్తుందని ఎయిర్​టెల్​ తెలిపింది.