ఏసీఈతో కాటో భాగస్వామ్యం క్రేన్ల తయారీకి జేవీ ఏర్పాటు

ఏసీఈతో కాటో భాగస్వామ్యం క్రేన్ల తయారీకి జేవీ ఏర్పాటు

హైదరాబాద్​, వెలుగు: యాక్షన్ కన్‌‌‌‌స్ట్రక్షన్ ఎక్విప్‌‌‌‌మెంట్ లిమిటెడ్ (ఏసీఈ), జపాన్‌‌‌‌కు చెందిన కాటో వర్క్స్ కంపెనీ లిమిటెడ్ కలిసి ఏసీఈ కాటో ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 50:50 ఉమ్మడి భాగస్వామ్య (జేవీ) సంస్థను ప్రకటించాయి. ఈ సంస్థ భారతదేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారీ సామర్థ్యం గల క్రేన్లను తయారు చేస్తుంది. 

హర్యానాలో 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తయారీ కేంద్రం కోసం సుమారు రూ.200 కోట్ల పెట్టుబడి పెడతారు. ఈ సంస్థ తొలి దశలో ట్రక్ క్రేన్లు, క్రాలర్ క్రేన్లు, రఫ్ టెర్రైన్ క్రేన్లను ఉత్పత్తి చేస్తుంది.  కాటో సాంకేతిక నైపుణ్యం, ఏసీఈ తయారీ సామర్థ్యం కలిసి గ్లోబల్ కాంపిటేటివ్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌ను నిర్మిస్తాయి.