ఆస్టర్‌‌‌‌‌‌‌‌ డీఎం క్వాలిటీ కేర్‌‌‌‌  కార్యకలాపాలు‌‌‌‌ షురూ...

ఆస్టర్‌‌‌‌‌‌‌‌ డీఎం క్వాలిటీ కేర్‌‌‌‌  కార్యకలాపాలు‌‌‌‌ షురూ...

హైదరాబాద్, వెలుగు: ఆస్టర్ డీఎం హెల్త్‌‌‌‌కేర్,  క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ (క్యూసీఐఎల్‌‌‌‌)ల విలీనం విజయవంతంగా పూర్తయిన తర్వాత ఏర్పడిన 'ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్'  ఈ నెల  ఒకటో తేదీ నుంచి సర్వీస్‌‌లు అందిస్తోంది. ఈ విలీనం ద్వారా ఆస్టర్ డీఎం, కేర్ హాస్పిటల్స్, ఎవర్‌‌‌‌కేర్, కిమ్స్ హెల్త్ వంటి నాలుగు ప్రముఖ హెల్త్‌‌‌‌కేర్ బ్రాండ్లు ఒకే గూటికి వచ్చాయి. కిమ్స్ హెల్త్‌‌‌‌, కిమ్స్ హాస్పిటల్స్ రెండు వేర్వేరు సంస్థలు.  

ఈ కొత్త సంస్థ దేశవ్యాప్తంగా 28 నగరాల్లో 39 ఆసుపత్రులు,  10,600 కంటే ఎక్కువ పడకల  సామర్థ్యంతో సేవలందిస్తోంది. రాబోయే ఏళ్లలో పడకల సంఖ్యను 15 వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ ఉమ్మడి సంస్థకు డాక్టర్ ఆజాద్ మూపెన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌‌‌‌గా కొనసాగుతుండగా, వరుణ్ ఖన్నా మేనేజింగ్ డైరెక్టర్,  గ్రూప్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.