ఎస్సీ హోదా తొలగింపు అన్యాయం..నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అభ్యంతరం

ఎస్సీ హోదా తొలగింపు అన్యాయం..నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అభ్యంతరం

ఉప్పల్, వెలుగు: క్రిస్టియన్​లోకి కన్వర్ట్​ అయిన ఎస్సీల హోదా తొలగింపు అన్యాయమని నేషనల్​ క్రిస్టియన్​ కౌన్సిల్​ అభ్యంతరం వ్యక్తం చేసింది. తార్నాక ఐనోన్​ చర్చిలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కౌన్సిల్​ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బిషప్​ సంజయ్​ ఆనంద్​ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్​కు వెళ్తామని తెలిపారు. 

ఎస్సీ క్రిస్టియన్ల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించేందుకు కౌన్సిల్​ సిద్ధంగా ఉందని చెప్పారు. తెలుగు రాష్ర్టాల్లో క్రిస్టియన్లపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులను  అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.