పాకిస్తాన్‌‌లోబస్సు లోయలో పడి 40 మంది మృతి..క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తుండగా ప్రమాదం..

పాకిస్తాన్‌‌లోబస్సు లోయలో పడి 40 మంది మృతి..క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తుండగా ప్రమాదం..
  • మరో 8 మందికి తీవ్ర గాయాలు

ఇస్లామాబాద్: నైరుతి పాకిస్తాన్‌‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు హైవేపై కంట్రోల్ తప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 40 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. బలూచిస్తాన్ రాష్ట్ర రాజధాని క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న ఈ బస్సులో.. మార్గమధ్యలో పాడైపోయిన మరో బస్సు ప్రయాణికులను కూడా ఎక్కించడంతో బస్సు కిక్కిరిసిపోయింది.

 బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌‌ఖ్వా సరిహద్దుల్లోని ‘ధానా సర్’ పర్వత ప్రాంతంలో అతివేగం  వల్ల బస్సు అదుపు తప్పి 70- నుంచి 80 అడుగుల లోతైన లోయలో పడిపోయిందని పోలీస్ అధికారి మహమ్మద్ నాసిర్ తెలిపారు. ‘‘ప్రమాద స్థలం కఠినంగా ఉండటంతో రెస్క్యూ టీమ్స్ మొదట ఇబ్బంది పడ్డాయి.

 ప్రస్తుతం సహాయక బృందాలు కట్టర్లు, భారీ మిషనరీతో బస్సు బాడీని కట్ చేసి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీస్తున్నారు” అని సహాయక విభాగం ప్రతినిధి ఫజల్ దిన్ చెప్పారు. ఈ ప్రమాదంపై పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వీక్ ట్రాఫిక్ రూల్స్, పూర్ రోడ్ సేఫ్టీ వల్ల పాకిస్తాన్‌‌లో ఇలాంటి ప్రమాదాలు రెగ్యులర్‌‌గా జరుగుతుంటాయి.