కారు స్టార్ట్ చేసిన నాలుగేండ్ల బాలుడు... ఢీకొని ఏడేండ్ల బాలుడు మృతి

కారు స్టార్ట్ చేసిన నాలుగేండ్ల బాలుడు... ఢీకొని ఏడేండ్ల బాలుడు మృతి
  • ములుగు జిల్లా మేడారంలో ప్రమాదం

తాడ్వాయి, వెలుగు : ఓ నాలుగేండ్ల బాలుడు కారు స్టార్ట్ చేయగా.. అది ముందుకు కదిలి మరో బాలుడిని ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన ములుగు జిల్లా మేడారంలో శుక్రవారం జరిగింది. మేడారం ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని అమీర్ పేటకు అలిమేకల పురుషోత్తం కుటుంబం, వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలం ఏలూరు గ్రామానికి చెందిన అరకటిక అరుణ్ కుమార్ ఫ్యామిలీ శుక్రవారం ఉదయం మేడారం వచ్చారు.

అమ్మవార్లను దర్శనం చేసుకున్న అనంతరం పక్క పక్కనే గదులు తీసుకొని విడిది చేశారు. కొద్దిసేపటి తర్వాత అరుణ్ కుమార్ నాలుగున్నర సంవత్సరాల కుమారుడు సాకేత్ తండ్రి వద్ద నుంచి కారు తాళాలు తీసుకుని, ఎక్కి స్టార్ట్ చేశాడు. దీంతో కారు కదిలి ముందు ఆడుకుంటున్న పురుషోత్తం కుమారుడు అలిమేకల కౌశిక్ (7)ను ఢీకొట్టి మీది నుంచి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ కౌశిక్ అక్కడికక్కడే చనిపోయాడు. బాలుడి తండ్రి పురుషోత్తం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై 
కమలాకర్ తెలిపారు.