
బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వరుసగా నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నానని రంజిత్ రెడ్డి లేఖలో తెలిపారు.
ఇంతకాలం తనకు పార్టీలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు రంజిత్ రెడ్డి . ఇన్ని రోజులు చెవేళ్ల ప్రజలను సేవ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కేసీఆర్ ను రంజిత్ రెడ్డి కేసీఆర్ ను రిక్వెస్ట్ చేశారు. కాగా రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం నడుస్తోంది. ఆయనకు కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
Also read : ఎంపీగా పోటీ చేయడం లేదు.. దానం క్లారిటీ
రంజిత్ రెడ్డి 2004లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు, మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై 14 వేల 391 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన ప్రస్తుతం పార్లమెంట్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయడం షాక్ కు గురిచేస్తోంది. ఇటీవల జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రాజీనామా చేసి బీజేపీలో చేరగా.. వరంగల్ ఎంపీపసనూరి దయాకర్ రావు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా బీఆర్ఎస్ కు రాజీనామా రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది.