చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల మండలంలోని ఆలూరు వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆలూరు స్టేజి వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆగడం లేదని బీజేపీ నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎంపీ శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అనంత్ రెడ్డి, వైభవ్ రెడ్డితో కలిసి ఎక్స్‌ప్రెస్ బస్సులో ఆలూరు వరకు వెళ్లారు. స్టేజి వద్ద బస్సు ఆపించి, ప్రయాణికులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు.
