చేవెళ్లలో కిలో గంజాయి సీజ్

చేవెళ్లలో కిలో గంజాయి సీజ్
  •     ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు 

చేవెళ్ల, వెలుగు :  ఆటోలో గంజాయిని తరలిస్తుండగా చేవెళ్ల పోలీసులు పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎస్ఐ ప్రదీప్ కుమార్ తెలిపిన ప్రకారం.. యూపీకి చెందిన రాజ్ కుమార్, బిహార్ కు చెందిన దిలీప్​కుమార్  సిటీలో ఉంటూ గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు. 

శనివారం చేవెళ్లలో పోలీసుల తనిఖీల్లో భాగంగా షాద్​నగర్ నుంచి చేవెళ్ల వైపు వెళ్లే ఆటోను ఆపి చెక్ చేయగా కిలో గంజాయి లభించింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయిని సీజ్ చేసినట్టు చేవెళ్ల ఎస్ ఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.