చికెన్​ 65 లొట్టలేసుకుని తింటున్నారు.. ఆల్​టైం ఫేవరెట్​ ఫుడ్​

చికెన్​ 65 లొట్టలేసుకుని తింటున్నారు.. ఆల్​టైం ఫేవరెట్​ ఫుడ్​

మాంసాహారులు ఎక్కువగా ఇష్టపడే వంటకాల్లో ఫ్రైడ్ చికెన్ ఒకటి. పెళుసైన క్రస్ట్‌తో పూసిన జ్యుసి చికెన్​ని ఎవరు ఆస్వాదించకుండా ఉండరు చెప్పండి?  ప్రపంచవ్యాప్తంగా ఫ్రైడ్ చికెన్‌కి ఉన్న ఆదరణను గుర్తిస్తూ , ఇటీవలే టేస్ట్ అట్లాస్ అనే ప్రముఖ ఫుడ్ గైడ్ సంస్థ ప్రపంచంలోని “10 బెస్ట్ ఫ్రైడ్ చికెన్ డిషెస్” జాబితాను విడుదల చేసింది. 

ఈ లిస్ట్‌లో ఇండోనేసియా చికెన్​అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండియాకు చెందిన చికెన్ 65 ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచి మోస్ట్ పాపులర్​ లిస్టులో చేరింది. చికెన్ 65 గురించి టేస్ట్ అట్లాస్ సంస్థ  వివరిస్తూ అది ఒక క్లాసిక్ పౌల్ట్రీ డిష్ అని పేర్కొంది. ఇది చెన్నైలో పుట్టిందని వెల్లడించింది.  

వాటి జాబితా ఇదే..

1.అయమ్ గోరెంగ్, ఇండోనేసియా
2.తైవానీస్ పాప్‌కార్న్ చికెన్, తైవాన్
3.సదరన్ ఫ్రైడ్ చికెన్, సదరన్ యూఎస్​ఏ
4.కరకరలాడే ఫ్రైడ్ చికెన్, గ్వాంగ్‌డాంగ్, చైనా
5.చికెన్ కైవ్, ఉక్రెయిన్
6.అయామ్ పెనియెట్, ఈస్ట్ జావ్, ఇండోనేషియా
7.పోజార్స్‌కాయ కొట్లేటా, రష్యా 
8.బ్యాక్‌హెండ్ల్, వియన్నా, ఆస్ట్రియా
9.హాట్ చికెన్, నాష్విల్లే, అమెరికా
10.చికెన్ 65, చెన్నై, ఇండియా