తేలికపాటి వర్షాలతో హైదరాబాద్ వెదర్ అంతా చల్లచల్లగా.. కూల్ కూల్ గా మారిపోయింది. ఈ ప్లజెంట్ వాతావరణంలో నోటికి కాస్త వేడి వేడిగా.. నాన్ వెజ్ తిగిలిస్తే బాగుంటుందని ఎవరైనా అనుకుంటారు. అందులో ఆదివారం (జూన్ 21) కావడంతో మాంసాహారానికి ఫుల్ డిమాండ్ పెరిగింది.
సిటీలో చికెన్ షాపులు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. అలాగే మటన్, ఫిష్ సెంటర్ల వద్ద కూడా జనాలు బారులు తీరారు. చల్లని వాతావరణంలో ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లుగా నాన్ వెజ్ ప్రియులు మాంసాహారాన్ని కొంటున్నారు.
హైదరాబాద్ లో చికెన్ రేట్లు ఇలా ఉన్నాయి..
ఇవాళ ఆదివారం (జూన్ 21) హైదరాబాద్ లో కేజీ చికెన్ 220 రూపాయలు ఉంది. అదే స్కిన్ లెస్ చికెన్ 230 రూపాయలు ఉంది.
ఇక బోన్ లెస్ చికెన్ 240 రూపాయలకు అమ్ముతున్నారు. కేజీ చికెన్ ధరలు ఇలా ఉన్నాయి.
- చికెన్ విత్ స్కిన్ రూ.220
- చికెన్ స్కిన్ లెస్ రూ.230
- చికెన్ బోన్ లెస్ రూ.240
మార్కెట్ పేపర్ రేట్లు ఇలా ఉన్నప్పటికీ.. బయట షాపుల్లో అధిక ధరలకు చికెన్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. పేపర్ రేట్ తో పోల్చితే 20, 30 రూపాయలు అధికంగా అమ్ముతున్నారని కస్టమర్లు చెబుతున్నారు. డిమాండ్ ను బట్టి ఒక్కో ఏరియాలో 250 నుంచి 300 మధ్య చికెన్ ధరలు ఉన్నట్లు తెలుస్తోంది.
