హైదరాబాద్, వెలుగు: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, భారత త్రివిధ దళాలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. త్రివిధ దళాల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని, యుద్ధంలో చిన్న పొరపాటు కూడా భారీ నష్టానికి దారితీస్తుందని హెచ్చరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివారం జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో జనరల్ అనిల్ చౌహాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న 244 మంది ఫ్లైట్ కేడెట్లకు వింగ్స్, బ్రెవెట్స్ ప్రదానం చేసి, పరేడ్‌ను స్వీకరించారు. వీరిలో 29 మంది మహిళా అధికారులు ఉండటం విశేషం. ఇండియన్ నేవీ నుంచి 8 మంది, కోస్ట్ గార్డ్ నుంచి ఆరుగురు, వియత్నాం వైమానిక దళం నుంచి ఇద్దరు కేడెట్లు కూడా కమిషన్ పొందారు. ఈ సందర్భంగా ఫ్లైట్ కేడెట్లను ఉద్దేశించి జనరల్ అనిల్ చౌహాన్ మాడ్లాడారు.
