హైదరాబాద్, వెలుగు: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ చాంపియన్షిప్‌లో తెలంగాణ ఆర్చర్, పెద్దపల్లికి చెందిన తానిపర్తి చికిత స్వర్ణం, కాంస్యంతో సత్తా చాటింది. పంజాబ్ భటిండాలోని గురుకాశీ యూనివర్సీటీలో సోమవారం జరిగిన కాంపౌండ్ ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో చికిత-ప్రథమేష్ జంట 156–156 (20-19 )తో టైబ్రేకర్‌లో రిషబ్ -ప్రగతిపై ఉత్కంఠ విజయం సాధించి స్వర్ణం అందుకుంది. విమెన్స్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో వర్షిణి (తమిళనాడు), -ఖుషి (రాజస్తాన్)తో కలిసి చికిత 231–226తో మహారాష్ట్ర త్రయంపై గెలిచింది.
