హైదరాబాద్, వెలుగు: మూగ బాలుడి ఘటన పై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (టీజీఎస్సీపీసీఆర్) సీరియస్‌గా స్పందించింది. పత్రికల్లో వచ్చిన వార్తను సుమోటోగా స్వీకరించిన చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి వెంటనే చర్యలకు ఉపక్రమించారు. బాలుడికి నిలోఫర్ హాస్పిటట్‌లో ఉత్తమ వైద్యం అందించాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
ఈ విషయాన్ని సీఎం కార్యాలయం దృష్టికి కూడా తీసుకెళ్లారు. సీఎం వెంటనే స్పందించి చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇకపై పిల్లలపై ఇలాంటి దాడులు జరగకుండా కుక్కల బెడదను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌కు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
