
- బాలల హక్కుల రక్షణ కమిషన్చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా చూడాలని, ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ బేగంపేటలోని సెస్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఎన్జీఓల ముఖ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయుష్మాన్ భారత్ కింద ‘పాఠశాలలు, ఆరోగ్యం, వెల్ నెస్ కార్యక్రమం’ అనే అంశంపై యూనిసెఫ్ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
సీతాదయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్, మొబైల్ ఫోన్స్, ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ వంటి ప్రమాదకర అల వాట్లపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎంతో అవసరమ ని, లేకపోతే పిల్లలు తప్పుదారి పట్టే ప్రమాదం ఉంద న్నారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస అవుతున్న పిల్లలను క్రీడలపై దృష్టి పెట్టేలా కృషి చేయాలన్నారు.