చైనాలో H3N8 వైరస్ బీభత్సం.. మరణాలు మొదలయ్యాయి

చైనాలో H3N8 వైరస్ బీభత్సం..  మరణాలు మొదలయ్యాయి

H3N8 బర్డ్ ఫ్లూ కారణంగా చైనాలో  మొదటి మరణం నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. WHO ప్రకారం, ఆగ్నేయ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 56 ఏళ్ల వ్యక్తి ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా స్ట్రెయిన్‌తో మరణించారు. 2002లో నార్త్ అమెరికన్ వాటర్ ఫౌల్‌లో ఈ వైరస్ మొదటిసారిగా గుర్తించబడింది. ఇది ముఖ్యంగా గుర్రాలు, కుక్కలు, సీల్స్‌కు సోకుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో చైనాలో రెండు కేసులు నమోదైనా.. అది మానవులలో గుర్తించలేదని ది గార్డియన్ నివేదిక వెల్లడించింది.

తాజాగా చైనాలో మరణించిన వ్యక్తి మరణంపై స్పందించిన డబ్ల్యూహెచ్ వో.. ఆమె నివసిస్తున్న చుట్టు పక్కల ఏవైనా పక్షులు ఉండి ఉండవచ్చని, వాటి వల్ల ఆమెకు వైరస్ సోకి ఉండవచ్చని అంచనా వేసింది. ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితుల్లో ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 
వైరస్ తో చనిపోయిన మహిళకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నందున, ఆమె మరణానికి దారితీసిందని యూఎన్ ఆరోగ్య సంస్థ తెలిపించి. ఈ ఘటనపై దానిపై ఇంకా దర్యాప్తు చేస్తున్నామని... ఆ మహిళ పౌల్ట్రీ మార్కెట్‌కు సమీపంలో నివసిస్తున్నందున ఆమెకు వైరస్ సోకి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. 

ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నుంచి ఎలా రక్షించుకోవాలి?

ప్రస్తుతానికి భారతదేశంలో బర్డ్ ఫ్లూ ప్రమాదం లేదని, కానీ వైరస్ నుంచి సురక్షితంగా ఉండటానికి నిపుణులు ఉత్తమమైన మార్గాలను సూచిస్తున్నారు, ముఖ్యంగా పక్షులకు దూరంగా ఉండాలని, దాని వల్ల వైరస్ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని సలహా ఇస్తున్నారు. పౌల్ట్రీ ఫామ్‌లలో పనిచేసే వ్యక్తులు లేదా వారి పెరట్లో కోళ్లు లేదా ఇతర జంతువులు కలిగి ఉన్న వ్యక్తులు వ్యాధి బారిన పడకుండా జంతువులను సంరక్షించేటపుడు వ్యక్తిగత రక్షణ సాధనాలను ధరించాలని అధికారులు సిఫార్సు చేస్తు్న్నారు.