తైవాన్ జలాల్లోకి ప్రవేశించిన చైనా షిప్ లు, జెట్ లు  

తైవాన్ జలాల్లోకి ప్రవేశించిన చైనా షిప్ లు, జెట్ లు  
  •     చైనా డ్రిల్స్ పై తైవాన్ ఆందోళన 
  •     తైవాన్ జలాల్లోకి ప్రవేశించిన చైనా షిప్ లు, జెట్ లు  
  •     తమ జెట్​లను పంపి హెచ్చరించిన తైవాన్

బీజింగ్:  తైవాన్ జలసంధిలో గురువారం నుంచి లైవ్ ఫైర్ డ్రిల్స్ కొనసాగిస్తున్న చైనా.. శనివారం మరో అడుగు ముందుకేసి సముద్రంలో బార్డర్ దాటేసింది. చైనా, తైవాన్​కు మధ్య తైవాన్ జలసంధిలో ఉన్న మీడియన్ లైన్ ను దాటి తమ జలాల్లోకి చైనాకు చెందిన 14 యుద్ధనౌకలు, 20 ఫైటర్ జెట్ లు ప్రవేశించాయని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. చైనా జెట్​లు, షిప్ లను మీడియన్ లైన్ ఆవలకు వెళ్లిపోవాలని హెచ్చరించేందుకు తమ ఫైటర్ జెట్​లను పంపామని తెలిపింది. శనివారం ఫైటర్ జెట్​లు, వార్ షిప్​లతో చైనా చేపట్టిన డ్రిల్స్ తమ దేశంపై దాడి కోసం జరుగుతున్న ప్రాక్టీస్ మాదిరిగానే ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. శుక్రవారం రాత్రి చైనాకు అతి దగ్గరలోని కిన్మెన్ ఐల్యాండ్స్ వద్ద కూడా చైనా డ్రోన్​లు తిరిగాయిని, వాటికి హెచ్చరికగా ఫ్లేర్స్​ను ఫైర్ చేశామని తెలిపింది. తైవాన్ భూభాగం చుట్టూ ఆర్మీ, నేవీ బేస్​లను అలర్ట్ చేశామని, మిసైల్ సిస్టంలను యాక్టివేట్ చేశామని వెల్లడించింది. దేశ రక్షణ కోసం సిద్ధమని తైవాన్ ప్రెసిడెంట్ సాయ్ ఇంగ్ వెన్ కూడా ఓ మెసేజ్​లో తేల్చిచెప్పారు.

తైవాన్ మిసైల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మృతి 

తైవాన్ మిలిటరీలో మిసైల్ డెవలప్మెంట్ విభాగానికి డిప్యూటీ హెడ్​గా ఉన్న కీలక అధికారి ఓయూ యాంగ్ లీషింగ్(57) శనివారం అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. పింగ్ టుంగ్ సిటీలోని ఓ హోటల్ రూంలో ఆయన చనిపోయారు. గుండెపోటుతో చనిపోయి ఉంటారని భావి స్తున్నా.. చైనాతో టెన్షన్ నేపథ్యంలో కుట్ర ఏమైనా జరిగిందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తు న్నట్లు అధికారులు చెప్పారు. నేషనల్ చుంగ్ షాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​సైన్స్ అండ్ టెక్నాలజీకి డిప్యూటీ హెడ్​గా ఉన్న లీషింగ్.. పలు కీలక మిసైల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను పర్యవేక్షించారు.