అవినీతి ఆరోపణలతో..చైనాలో ఇద్దరు మాజీ మంత్రులకు మరణశిక్ష

అవినీతి ఆరోపణలతో..చైనాలో ఇద్దరు మాజీ మంత్రులకు మరణశిక్ష

బీజింగ్‌‌‌‌: అవినీతి ఆరోపణల కేసులో  చైనా కు చెందిన ఇద్దరు మాజీ డిఫెన్స్ మినిస్టర్లు వీ ఫెంఘే, లి షాంగ్‌‌‌‌ఫూలకు ఆ దేశ మిలిటరీ మరణశిక్ష విధించింది. అయితే, దీన్ని రెండేండ్ల నిలిపివేత (రిప్రివ్)తో కూడిన మరణశిక్షగా గురువారం ప్రకటించింది.  అంటే, వీరిని వెంటనే ఉరితీయకుండా రెండేండ్ల పాటు జైలులో పెట్టి వారి ప్రవర్తనను గమనిస్తారు. ఆ కాలంలో వారు క్రమశిక్షణతో ఉంటే మరణశిక్ష జీవిత ఖైదుగా మారుతుంది. చైనా సైనిక నాయకత్వంలో వీ ఫెంఘే(72), లి షాంగ్‌‌‌‌ఫూ( 68) లంచాలు తీసుకున్నట్ఉల నిర్ధారణ కావడంతో వీరికి శిక్ష ఖరారు అయింది.