భారత్ ను అన్ని విధాలుగా దెబ్బతీసేందుకు చైనా కుట్రలు చేస్తుంది. అందుకే అరుణాల్ ప్రదేశ్, అస్సాం మేఘాలయా, సిక్కిం, నాగలాండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు నీళ్లందించే బ్రహ్మపుత్ర నది సమీపంలో చైనా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి చైనాకు చెందిన టిబెట్ లో పుట్టిన బ్రహ్మపుత్ర నది అక్కడి నుంచి ఇండియా మీదిగా ప్రవహించి బంగ్లాదేశ్ లో బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇప్పటికే చైనా.., భారత్ కు హాని తలపెట్టేందుకు పలు ప్రాజెక్ట్ లను నిర్మించింది. ఇలా ప్రాజెక్ట్ లు చేపట్టడం వల్ల దిగువున ఉన్న భారత్ తో పాటు, బంగ్లాదేశ్ లు తీవ్రంగా నష్టపోతాయి. ఇదే విషయంపై చైనాతో.., భారత్ వాదించినప్పుడల్లా..మేం ప్రాజెక్ట్ లు కడుతున్నాం. మీకు ఎలాంటి ప్రమాదం ఉండదంటూ దాటవేత ధోరణిలో ఉంది.
తాజాగా చైనా తన పంచ వర్ష ప్రణాళికలో బ్రహ్మపుత్ర నదిపై హైడ్రోపవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రాజెక్ట్ వల్ల అపారనష్టం జరుగుతుందని చైనాను భారత్ కు చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.
