తైవాన్​విలీనంపై చైనా బ్లూప్రింట్

తైవాన్​విలీనంపై చైనా బ్లూప్రింట్
  • రిలీజ్ చేసిన చైనీస్ సెంట్రల్ కమిటీ, స్టేట్ కౌన్సిల్
  • తైవాన్ చుట్టూ భారీగా యుద్ధ నౌకల మోహరింపు

హాంకాంగ్: తైవాన్​ను ఆక్రమించుకునేందుకు చైనా ఇప్పటి దాకా ఆ దేశం చుట్టూ సైనిక విన్యాసాలు చేసింది. యుద్ధ నౌకలు మోహరించింది. కానీ, ఈసారి ఓ అడుగు ముందుకేసి.. తైవాన్​ను తనలో కలుపుకునేందుకు ఏకంగా బ్లూప్రింట్ రిలీజ్ చేసింది. చైనా తీర ప్రాంతాలైన ఫుజియాన్‌‌, తైవాన్‌‌ మధ్య జలసంధుల పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేలా డ్రాగన్‌‌ ఈ ప్రణాళిక ఆవిష్కరించింది.

 తైవాన్ వైపు వార్ ప్లేన్​లు, వార్ షిప్​లు పంపిస్తూనే.. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన సెంట్రల్ కమిటీ, స్టేట్ కౌన్సిల్ కలిసి బ్లూ ప్రింట్​ను మంగళవారం రిలీజ్ చేశాయి. భవిష్యత్తులో తైవాన్ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను ఈ బ్లూ ప్రింట్​లో చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ పేర్కొంది. 

తైవాన్‌‌తో సమగ్ర అభివృద్ధికి ఫుజియాన్‌‌ను ‘స్పెషల్ జోన్’గా మార్చడమే ఇందులో వ్యూహం. తైవాన్‌‌ ప్రజలు చైనాలో స్థిరపడేందుకు, వ్యాపారాలు చేసేందుకు వీలుగా ఫుజియాన్‌‌ను ‘ఫస్ట్‌‌ హోం’గా పేర్కొంటూ బ్లూ ప్రింట్ ఆవిష్కరించినట్లు డ్రాగన్‌‌ మీడియా పేర్కొంటున్నది. 

వారం రోజులుగా పెరిగిన సైనిక ఒత్తిడి

తైవాన్​పై వారం రోజులుగా చైనా సైనిక ఒత్తిడి పెరిగింది. బ్లూ ప్రింట్ రిలీజ్ చేశాక.. ఇది మరింత ఎక్కువైంది. తైవాన్ జల సంధిలోకి చైనా తాజాగా సబ్​మెరైన్లు, పదుల సంఖ్యలో యుద్ధ నౌకలు పంపింది. తైవాన్ చుట్టూ చైనా ఫైటర్ జెట్లు చక్కర్లు కొడుతున్నట్లు చైనా మీడియా వెల్లడించింది. 

పోయిన వారం చివర్లో అమెరికా, కెనడా యుద్ధ నౌకలు తైవాన్ జలసంధిలో ప్రయాణించాయి. దీంతో యూఎస్, కెనడాతో కలిసి తైవాన్ తమకే సవాల్ విసిరిందన్న కోపంతో చైనా.. తమ యుద్ధ నౌకల దండును తైవాన్‌‌ జలసంధిలోకి పంపింది. 

బ్లూ ప్రింట్ చూసి నవ్వొస్తున్నదన్న తైవాన్చై

నా రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ చూస్తుంటే నవ్వొస్తున్నదని తైవాన్ అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన చట్టసభ్యుడు వాంగ్ టింగ్ యు అన్నారు. తైవాన్​కు వ్యతిరేకంగా యునైటెడ్ ఫ్రంట్ వర్క్​ను ఎలా అమలు చేయాలన్న దాని కంటే.. తన అప్పులు ఎలా తీర్చుకోవాలన్న దానిపై చైనా దృష్టి పెడితే బాగుంటుందని చురకలంటించారు. అయితే, తైవాన్ కామెంట్లపై గురువారం చైనా స్పందించింది. 

జిన్​పింగ్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం తైవాన్ అభివృద్ధి కోసం బ్లూప్రింట్ సిద్ధం చేసిందని తెలిపింది. ఫ్యుజియాన్ స్పెషల్ జోన్​గా ఉంటుందని ప్రకటించింది.  తైవాన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్​మెంట్​తో పాటు శాంతియుత వాతావరణం స్థాపించేందుకు ఈ బ్లూ ప్రింట్ ఎంతో దోహదం చేస్తుందని వివరించింది.

తైవాన్​తో సమగ్ర అభివృద్ధి కోసం ఫుజియాన్​ను స్పెషల్ జోన్​గా మార్చాలనే ప్రతిపాదన 2021లోనే చైనా తన అఫీషియల్ డాక్యుమెంట్స్​లో చెప్పింది. జూన్​లో చైనా నాయకుడు ఫోరమ్​లో బ్లూ ప్రింట్ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు.. ఇదొక అర్థం లేని ప్రతిపాదన అని తైవాన్ అఫైర్స్ కౌన్సిల్ విమర్శించింది. 

తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలు

బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు తమ దేశం చుట్టూ చైనా 68 వార్​ప్లేన్స్, 10 యుద్ధ నౌకలు మోహరించిందని తైవాన్ తెలిపింది. బుధవారం తైవాన్ మీద 35 చైనీస్ యుద్ధ విమానాలు గుర్తించామని వివరించింది. వెస్ట్రన్ పసిఫిక్ ఓసియన్​లో సైనిక విన్యాసాలు చేపడుతున్నదని తెలిపింది. 

మస్క్.. మీ పని మీరు చేసుకోండి: తైవాన్తై

వాన్.. చైనాలో భాగమే అంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన కామెంట్లకు తైవాన్ దీటుగా బదులిచ్చింది. తైవాన్ అమ్మకానికి లేదని, తమకు సలహాలు ఇచ్చే బదులు చైనాలో నీ సంగతేమిటో చూసుకో అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. 

ఇటీవల ఎలాన్‌‌ మస్క్‌‌ మాట్లాడుతూ.. అమెరికాకు హవాయి ఎలాగో.. చైనాకు తైవాన్‌‌ అలాగే అని కామెంట్లు చేశారు. దీంతో ‘శ్రద్ధగా వినండి.. తైవాన్‌‌ పీఆర్‌‌సీలో భాగం కాదు. అలాగని అమ్మకానికి లేదు. మీరు ట్విట్టర్​ను చైనా ప్రజలకు అందుబాటులోకి తీసుకురమ్మని సీసీపీని కోరతారని నేను ఆశిస్తున్నా’’ అని తైవాన్ ఎద్దేవా చేసింది. చైనాలో ట్విట్టర్ పై బ్యాన్ ఉండటంతో ఈ కామెంట్ చేసింది.