మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలి : చిన్నారెడ్డి

మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలి : చిన్నారెడ్డి
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి మార్క్​ఫెడ్ అధికారులకు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. క్వింటాల్‌‌కు రూ.2,400 చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మక్కల కొనుగోలుకు సంబంధించి బ్యాంక్​గ్యారంటీకి రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో మొక్కజొన్న సాగుపై విధించిన ఆంక్షలతో పంట విస్తీర్ణం తగ్గిందని ఆరోపించారు. ఇక, ప్రస్తుత సీజన్‌‌లో పత్తి దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు. సీసీఐని రంగంలోకి దించి, వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను సూచించారు