చిట్యాల, వెలుగు: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జాతీయ రహదారి 65 పై ప్రయాణికుల రాకపోకలను, ట్రాఫిక్ ను చిట్యాలలో డీఎస్పీ శివరాం రెడ్డి సీఐ నాగరాజు ఎస్సై మావిడి రవికుమార్ ఎస్పీలతో శరత్‌చంద్ర పవార్ పరిశీలించారు. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
వాహనాల ప్రవాహం సాఫీగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. ముఖ్యంగా బస్సులు, లారీలు, వ్యక్తిగత వాహనాల కదలికలను పర్యవేక్షిస్తూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు. పండుగ వేళ ప్రయాణికుల భద్రతే ప్రథమ లక్ష్యమన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
