మహిళా సంక్షేమానికి పెద్దపీట

మహిళా సంక్షేమానికి పెద్దపీట

రామడుగు/గంగాధర, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కరీంనగర్ ​జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రామడుగు మండలం వెలిచాలలో మంగళవారం నిర్వహించిన మహిళా గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తున్నాయని అన్నారు. అనంతరం మాతాశిశు ఆస్పత్రిలో డెలివరీ అయిన 14 మంది బాలింతలకు ఒక్కొక్కరికి రూ.2 వేలు చొప్పున ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ వీర్ల నరసింగరావు, పంచాయతీ కార్యదర్శి సత్తయ్య, మాజీ సర్పంచ్ కాడె శంకర్ తదితరులు పాల్గొన్నారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు  సమన్వయంతో పనిచేయండి

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంలో పనిచేయాలని ఎమ్మెల్యే సత్యం సూచించారు. గంగాధర ఎంపీడీవో ఆఫీస్​లో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరుపై సర్పంచులు నిలదీశారు. గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, విద్యుత్, రోడ్లు, ఇతర మౌలిక వసతులపై అధికారులకు వివరిస్తే నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. 

సర్పంచులు లేవనెత్తిన పలు సమస్యలపై ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీవో రాము, ఉద్యానవనశాఖ అధికారి ప్రియదర్శిని, ఏఎంసీ చైర్మన్​ రజిత, తహసీల్దార్​ అంబటి రజిత తదితరులు పాల్గొన్నారు. గంగాధర మండలం కొండన్నపల్లి సర్పంచ్ రేండ్ల శ్రీనివాస్ తండ్రి ముత్తయ్య అనారోగ్యంతో మృతిచెందగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం  పరామర్శించారు.