జాతీయస్థాయి చెస్ విజేతగా సిద్ధార్థ స్కూల్ స్టూడెంట్ ఆకుల శౌర్య

జాతీయస్థాయి చెస్ విజేతగా సిద్ధార్థ స్కూల్  స్టూడెంట్ ఆకుల శౌర్య

చొప్పదండి, వెలుగు: కరీంనగర్​జిల్లా చొప్పదండిలోని సిద్ధార్థ హైస్కూల్​6వ తరగతి స్టూడెంట్ ఆకుల శౌర్య జాతీయస్థాయి చెస్ పోటీల్లో విజేతగా నిలిచినట్లు విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి తెలిపారు.

ఈ నెల 18, 19 తేదీల్లో కరీంనగర్‌‌‌‌లోని జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన ఆల్ ఇండియా 4వ చెస్ ఛాంపియన్‌‌‌‌షిప్ (అండర్-12 విభాగం)లో శౌర్య విజేతగా నిలిచి గోల్డ్​మెడల్ సాధించాడు. ఉత్తమ ప్రతిభ కనబర్చి విజేతగా నిలిచిన శౌర్యను సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్, ప్రిన్సిపాల్, చెస్ ట్రైనర్, టీచర్లు అభినందించారు.