సినీ డిజిటల్ ఆర్టిస్ట్ ఎన్నికలు వాయిదా వేయాలి: తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి

సినీ డిజిటల్ ఆర్టిస్ట్ ఎన్నికలు వాయిదా వేయాలి: తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి

ముషీరాబాద్, వెలుగు: తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్‎లో దొంగ సభ్యత్వాలు నమోదయ్యాయని, సంఘం ఎన్నికల్లో గెలిచేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని తెలుగు సినిమా వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి ఆరోపించారు. ఈ నెల 28న జరగనున్న ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం చిక్కడపల్లిలోనే లేబర్ కార్యాలయంలో వేదిక ప్రతినిధులు లారా, మోహన్ బైరాగితో కలిసి రాష్ట్ర కార్మికశాఖ అడిషనల్​కమిషనర్ గంగాధర్ కు వినతిపత్రం అందజేశారు.

అనంతరం మాట్లాడుతూ.. తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్‎లో వెల్లంకి శ్రీనివాస్, కేడీ.రాజు, నర్సింహారెడ్డి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందన్నారు. వీరు సభ్యత్వాల పేరిట సేకరించిన డబ్బుల లెక్క తేల్చి, దొంగ సభ్యత్వాలను తొలగించిన తర్వానే ఎన్నికలు నిర్వహించేలన్నారు.  కేసీఎస్.ప్రసాద్, శంకర్ పాల్గొన్నారు.