- పౌరసత్వంపై రాజకీయాలు వద్దని సూచన
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో బీజేపీ సభ్యత్వం ఉన్నవారికే పౌరసత్వం ఇస్తారేమోనని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. గురువారం ఎక్స్‌లో కేంద్రం తీరుపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ సభ్యత్వ కార్డుల ఫొటోలను కూడా ఆయన షేర్ చేశా రు. దేశ పౌరుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొం దే ప్రధాన పత్రాల్లో పాస్‌పోర్టు ఒకటని, అలాంటి పత్రాన్నే పౌరసత్వానికి ఆధారం కాదని చెప్పడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు.
పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజల్లో గందరగోళానికి దారితీ స్తున్నాయని ఆయన విమర్శించారు. తరచూ నిబంధనలు మార్చడం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్వదేశంలోనే పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు రావడం బాధాకరమని తెలిపారు. గుర్తింపు కార్డులు, పౌరసత్వ అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని సూచించారు. కేంద్రం ప్రజల ఆందోళనలను గమనించాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో సర్ ప్రక్రియపై ఆందోళన
రాష్ట్రంలో చేపడుతున్న సర్ ప్రక్రియపై ఒవైసీ ఆందోళ న వ్యక్తంచేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఓటర్లకు వివరాలు ఉన్న ఫారా లు ఇచ్చి, వాటిని పరిశీలించి సంతకం చేసి ఫొటోలు జతచేసి సమర్పించాలని ఎన్నికల సంఘం తెలిపిందన్నారు. ఇప్పుడు తాజా ఓటరు జాబితా, 2002 ఎన్నికల రోల్స్ ఆధారంగా ఓటర్లే స్వయంగా వివరాలు నమోదు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రక్రి యను సులభతరం చేయడానికి ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రీ–మ్యాపింగ్ వివరాలను బూత్ స్థాయి ఏజెంట్లతో పంచుకోవాలని కోరినప్పటికీ ఆ విజ్ఞప్తిని ఆమోదించలేదన్నారు.
అలాగే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, రేషన్ కార్డు వంటి పత్రాలను కూడా అంగీకార పత్రాల జాబితాలో చేర్చాలని కోరినా ఒప్పుకోలేదని తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలంతో పాటు సమయం తక్కువగా ఉండటంతో ఈ ప్రక్రియను పూర్తి చేయడం కష్టసాధ్యమని చెప్పారు. ఓటర్లకు సాయపడేందుకు తమ పార్టీ ప్రత్యేక యాప్‌ను రూపొందించడంతో పాటు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.
ముజఫర్‌నగర్ ఘటనపై ఆగ్రహం
యూపీలోని ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసిన బంధు వా కార్మికుల ఘటనపై ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను బంధించి హింసించడం, దుర్భాషలాడడం, ఆకలితో ఉంచడం వంటి చర్యలు నేటి కాలంలో అత్యంత సిగ్గుచేటు, బాధాకరమని ఒవైసీ అన్నారు.
