వాన పడితే.. ఇక అంతే

వాన పడితే.. ఇక అంతే
  •    గంటల తరబడి ట్రాఫిక్ జామ్​లతో వాహనదారులకు ఇబ్బందులు
  •   డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేదంటున్న  పర్యావరణ వేత్తలు

హైదరాబాద్, వెలుగు:  సిటీలో చిన్న వానకే రోడ్లన్నీ చెరువుల లెక్కన అయిపోతున్నాయి. వాటర్​ లాగింగ్స్‌‌‌‌ వల్ల జనాలు రోడ్లు దాటలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక భారీ వర్షం కురిస్తే నీళ్లు క్లియర్‌‌‌‌‌‌‌‌ అయ్యేందుకు గంటల సమయం పడుతోంది. వర్షం పడినప్పుడు ఫ్లై ఓవర్ల ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర నీరు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్​తో వాహనదారులు వెనక్కి వెళ్లే వీలు కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. సిటీ వ్యాప్తంగా ఇలాంటి వాటర్ లాగింగ్స్ పాయింట్లను ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడో గుర్తించారు. నీరు నిలిచినప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటున్నారే తప్ప ఇందుకు శాశ్వత పరిష్కారాన్ని చూపడంలో అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఎప్పుడు వర్షం కురిసినా ట్రాఫిక్ జామ్,  వాటర్ లాగింగ్ పాయింట్స్ వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయి.

18 ప్రాంతాల్లో  క్రిటికల్ వాటర్ లాగింగ్స్
వర్షం పడినప్పుడు మాత్రమే హడావుడి చేస్తున్న బల్దియా అధికారులు తర్వాత సమస్యను పట్టించుకోవడం లేదు. వాటర్ లాగింగ్స్ కారణంగా మెయిన్ రోడ్లపై కి.మీ  మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. వర్షం పడితే  ఇప్పటికీ వాటర్ లాగింగ్ పాయింట్ల పరిస్థితి అలాగే ఉంటోంది. గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఇప్పటికే 184 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించారు. ఇందులో సుమారు 18 క్రిటికల్ వాటర్ లాగింగ్స్ పాయింట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వాన కురిస్తే ఆయా ప్రాంతాల్లో వాహనదారులకు ఇబ్బంది తప్పడం లేదు. నీళ్లు నిలిచిపోవడంవల్ల ఆ దారిలో ఉన్న పాట్ హోల్స్, ప్యాచెస్ కనిపించక ఎంతో మంది  ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్నిచోట్ల మెట్రో డివైడర్ల కారణంగా  వర్షపు నీరు నిలిచిపోతోంది.ఖైరతాబాద్‌‌‌‌, రాజ్‌‌‌‌భవన్‌‌‌‌  రోడ్‌‌‌‌, లక్డీకపూల్‌‌‌‌ నిరంకారి చౌరస్తా, మలక్‌‌‌‌పేట్‌‌‌‌ రైల్వే బ్రిడ్జి, బేగంపేట పరిసర ప్రాంతాల్లో ఇలాంటి లాగింగ్స్‌‌‌‌ పాయింట్స్‌‌‌‌ ఎక్కువగా ఉన్నాయి. పెరుగుతున్న గ్రేటర్ జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం, మెట్రో, ఫ్లై ఓవర్ నిర్మాణ సమయాల్లో ఇంజనీరింగ్ డిజైన్ సరిగా లేకపోవడం ఈ వాటర్ లాగింగ్స్ కు ప్రధాన కారణాలుగా పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు.

వర్షపు నీటి కాలువల ఏర్పాటుతో..
అధికారులు అర్బన్  గైడ్ లైన్లను మిస్ అవుతున్నారు. దీంతో వర్షపు నీరు, డ్రైనేజీ వాటర్ కలిసిపోతున్నాయి. పైప్​లైన్లకు కెపాసిటీ లేకపోవడంతో 
ఆ నీరంతా మ్యాన్‌‌‌‌హోల్స్ ద్వారా  పైకి వస్తోంది. రెయిన్ వాటర్ మొబిలిటీ మీద అవగాహన లేదు. నాలా వైడెనింగ్​కు సమయం పట్టేలా ఉండటంతో రోడ్ల మీద వాటర్ లాగింగ్స్ ఏర్పడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇంకు డు గుంతలు, వర్షపు నీటి కాలువలను ఏర్పాటు చేయాలి. 
- లక్ష్మణ్ రావు, ప్రొఫెసర్, కూకట్​పల్లి జేఎన్టీయూ

అర్బన్ వాటర్ షెడ్ ప్లానింగ్‌‌‌‌తో.. 
అర్బన్ ఫ్లడ్స్ మీద గతంలో పరిశోధనలు జరిగాయి. పరిశోధకులు ఆ సమయంలో సిటీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏరియాల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆ దిశగా పనులు జరగలేదు. అండర్ గ్రౌండ్ వాటర్ కెపాసిటీ తగ్గిపోయింది. వర్షపు నీళ్ల  ఫ్లో పెరిగిపోయింది. దీంతో నీళ్లు వెనక్కి వచ్చి రోడ్లపై నిలిచిపోతున్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే డ్రైనేజీలోని మట్టి, చెత్తను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి. వాటర్ లాగింగ్స్​ను బట్టి  పైప్​లైన్లను ఏర్పాటు చేయాలి. నీళ్లు నిలిచే ఏరియా వ్యూ తీసుకుని అవసరమైన చోట పెద్ద పైప్‌‌‌‌ లైన్లు ఉంటే బెటర్. 
- దొంతి నరసింహా రెడ్డి, పర్యావరణవేత్త