పిల్లల పేరుపై మ్యూచువల్ ఫండ్ పెట్టుబడితో బోలెడు లాభాలు.. సంపదతో పాటు సంతోషం

పిల్లల పేరుపై మ్యూచువల్ ఫండ్ పెట్టుబడితో బోలెడు లాభాలు.. సంపదతో పాటు సంతోషం

సాధారణంగా తల్లిదండ్రులు తన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతుంటారు. కానీ అదే పెట్టుబడిని తెలివిగా మైనర్ల పేరుపైనే చేస్తే పన్ను పరంగా కూడా ప్రయోజనం పొందవచ్చని ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ సీఏ నితిన్ కౌశిక్ తెలిపారు. పేరెంట్స్ జస్ట్ పెట్టుబడి పద్దతిని మార్చడం ద్వారా పిల్లల భవిష్యత్తు సురక్షితం చేయడమే కాకుండా.. పెద్దమొత్తంలో ట్యాక్స్ సేవింగ్ కూడా పొందవచ్చని ఆయన సూచించారు. 

పేరెంట్స్ సాధారణంగా తమ పేరుపైనే మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్లలో పెట్టుబడులు పెడతుంటారు. కానీ కౌశిక్ సూచన విధంగా.. పిల్లల పేరుతో “మైనర్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్” ఓపెన్ చేసి.. దానికి తల్లిదండ్రులు గార్డియన్‌గా వ్యవహరించటం మరింత ప్రయోజనకరం. పిల్లలకు 18 ఏళ్లు నిండే వరకు అందులో వచ్చే ఆదాయం తల్లిదండ్రుల్లో ఆదాయం అధికంగా ఉన్న వారితో టాక్స్ చట్టాల ప్రకారం క్లబ్బింగ్ చేయబడుతుంది. కానీ అసలు ప్రయోజనం పిల్లలు పెద్దయ్యాకే లభిస్తుంది.

పిల్లలకు 18 ఏళ్లు నిండాక.. ఆ పెట్టుబడులు చట్టపరంగా అతని పేరుకి ట్రాన్స్ ఫర్ అవుతాయి. ఈ క్రమంలో దాని నుంచి వచ్చే కేపిటల్ గెయిన్స్ తల్లిదండ్రుల పేరుపై కాకుండా పిల్లవాడి పేరు మీగే ట్యాక్సేషన్ జరుగుతుంది. సాధారణంగా కొత్తగా పెద్దవాడైన వారికి ఇతర ఆదాయం తక్కువగా ఉండటం వల్ల ట్యాక్స్ భారం తక్కువగా ఉంటుంది. దీని వల్ల ఏడాదికి రూ.4.25 లక్షల నుండి రూ.4.75 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ ఆదాయం పొందే అవకాశం ఉంటుందని సీఏ వెల్లడించారు.

►ALSO READ | లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ : 14 నెలల తర్వాత దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్

ఉదాహరణకు పేరెంట్స్ పిల్లల పేరుపై నెలకు రూ.5వేల చొప్పున 10 సంవత్సరాలు పెట్టుబడి పెడితే.. పిల్లవాడు 18 సంవత్సరాలు వచ్చే సమయానికి రూ.12 లక్షల వరకు కార్పస్ ఏర్పడవచ్చు. ఆ డబ్బులో రూ.4 లక్షల లాంగ్‌టర్మ్ గెయిన్స్‌ కోసం రిడీమ్‌ చేసినా.. పిల్లవాడి పేరులో ట్యాక్స్ ఉండదు. కానీ అదే పెట్టుబడి తల్లిదండ్రుల పేరులో ఉంటే 10% లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే పిల్లలకు ఈ డబ్బును గిఫ్ట్ గా ఇచ్చినట్లు రికార్డ్ చేయాల్సి ఉంటుందని సీఏ వెల్లడించారు. మైనర్ ఫోలియోకు గార్డియన్ KYC పూర్తి చేసి.. పిల్లవాడు 18 ఏళ్లు దాటిన వెంటనే ఆ ఫోలియో అతని పేరులోకి ఆటోమేటిక్‌గా బదిలీ అయ్యేలా చూడాల్సి ఉంటుంది. ఇలా స్మార్ట్ ఇన్వెస్టింగ్ చేస్తే చేతికి ఎక్కువ డబ్బు పొందుతారు తక్కువ టాక్స్ భారంతో.