బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల ముంబైలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. శుక్రవారం హీరో సల్మాన్ ఖాన్ ఈ మూవీ అప్‌డేట్ ఇచ్చారు. సినిమా ఓపెనింగ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసిన సల్మాన్.. ‘‘మనం కాస్త ముందు చూపుతో ఆలోచించాలి. అందుకే మేము ఈద్ తేదీని ప్రకటించాం..’ అంటూ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు.
వచ్చే ఏడాది మార్చి 9న ఈద్ పండుగ. అయితే అదే నెల 5న ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమా విడుదల కానుంది. జనవరిలోనే ఈ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, సందీప్ రెడ్డి గత చిత్రాల ట్రాక్ రికార్డ్‌ను బట్టి ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు సల్మాన్ ఖాన్ సినిమాలు ఈద్‌కు రావడం బాలీవుడ్‌లో పరిపాటి. మొత్తానికి ఇద్దరు టాలీవుడ్ డైరెక్టర్స్ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పోటీకి గ్రౌండ్ రెడీ చేస్తున్నారు. మరి ప్రభాస్, సల్మాన్ ఖాన్ మధ్య పోటీ ఉండబోతోందా లేక రెండు చిత్రాల్లో ఏదైనా వాయిదా పడుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

