
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కోహెడలో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు కత్తులు,కర్రలతో కొట్టుకున్నారు. పోలీసుల ముందే పరస్పర దాడులకు దిగారు.
అసలేం జరిగిందంటే.. కోహెడ సర్వే నెంబర్ 951,952 లో ప్లాటో ఓనర్స్, ఫాంహౌస్ యాజమాన్యానికి వివాదం నడుస్తోంది. 15 రోజల క్రితమే రంగారెడ్డి జిల్లా కోర్టు ప్లాట్ ఓనర్స్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో కోర్టు ఆర్డర్ తో ప్లాట్ క్లీన్ చేస్తుండగా ఫాంహౌస్ నిర్వాహకులు అడ్డుకున్నారు. హైడ్రా కొంత భాగం కూల్చివేసి వెళ్లగానే మిగతా భాగాన్ని జేసీబీ సాయంతో ప్లాట్ ఓనర్స్ క్లీన్ చేయడానికి ప్రయత్నించారు. ప్లాట్ ఓనర్స్ క్లీన్ చేస్తున్న సమయంలోనే ఫామ్ హౌస్ నిర్వాహకులు కత్తులు, గొడ్డల్లతో దాడి చేశారు. దీంతో ఇరు వర్గాలు కట్టెలతో కొట్టుకున్నారు. పోలీసుల ముందే ఇరు వర్గాలు కట్టెలతో కొట్టుకున్నారు.
ALSO READ | మినీ ట్యాంక్‌బండ్ పేరిట .. జీవన్‌రెడ్డి రూ.3కోట్లు మింగేసిండు : వినయ్ కుమార్ రెడ్డి
ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మూడు రోజుల క్రితమే తమకు రక్షణ కావలాని అడిగినా పోలీసులు పట్టించుకోలేదని ప్లాట్ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ముందే ప్లాట్ కబ్జా చేసిన వ్యక్తులు తమపై దాడి చేశారని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.