కార్వాన్‌‌లో వినాయక మండపం తొలగింపుపై ఘర్షణ.. నలుగురికి గాయాలు

కార్వాన్‌‌లో వినాయక మండపం తొలగింపుపై ఘర్షణ.. నలుగురికి గాయాలు

ఓల్డ్‌‌సిటీ, వెలుగు: కార్వాన్​లో వినాయక మండపం తొలగింపు విషయంలో నిర్వాహకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో కాలనీకి చెందిన నలుగురు గాయపడ్డారు. ఆదివారం ఉదయం వినాయక మండపం స్థల యజమాని సంతోష్ షెడ్డును తొలగించేందుకు వెల్డర్ మహమ్మద్ అబ్దుల్లాను తీసుకెళ్లాడు. ఈ సమయంలో స్థానిక యువకులు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు వారితో వాగ్వాదానికి దిగారు. 

అనంతరం కర్రలు, రాళ్లతో దాడి చేయగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తొమ్మిది నెలలుగా ఈ స్థలంపై వివాదం కొనసాగుతోందని సమాచారం. హైడ్రా కమిషనర్‌‌కు ఫిర్యాదు చేయగా, తొలగించాలని జీహెచ్​ఎంసీ ఖైరతాబాద్ జోన్ కమిషనర్ ఆదేశించారని సంతోష్​ తెలిపాడు. 

సిబ్బంది కొరత కారణంగా తననే తొలగించుకోవాలని సూచించారని చెప్పాడు. మరోవైపు ఖాళీ ప్రదేశంలో వినాయక మండపం షెడ్‌‌ను శాశ్వతంగా ఉంచాలని మండప నిర్వాహకులు కార్తీక్, ధనరాజ్, వెంకటేష్, వినయ్ కోరుతున్నారు. ఈ ఘటనపై ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కుల్సుంపురా ఇన్‌‌స్పెక్టర్ పి.రాములు తెలిపారు.