ఈ ఏడాది నుంచే మెడికల్​ కాలేజీ క్లాసెస్​

ఈ ఏడాది నుంచే మెడికల్​ కాలేజీ క్లాసెస్​

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఈ విద్యా సంవత్సరం నుంచే100 సీట్లతో తరగతులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ​కుమార్ ​తెలిపారు. బుధవారం పాత కలెక్టరేట్​భవన కాంప్లెక్స్ లో క్లాసెస్ ​ప్రారంభం కానున్న నేపథ్యంలో కలెక్టర్ ​వీపీ గౌతమ్​తో కలిసి పనుల పురోగతిని మంత్రి పరిశీలించారు. పనులు చురుకుగా సాగుతున్నాయని, అనుకున్న సమయానికి పనులు పూర్తిచేసి తరగతులు ప్రారంభిస్తామన్నారు. 

భవనాలు, ఫెసిలిటీస్, ల్యాబ్​లు, టీచింగ్, విద్యుత్, ఇతర సదుపాయాలను పరిశీలించి ఆఫీసర్లతో చర్చించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న పాత కలెక్టరేట్ లో రూ.9కోట్లతో ఆధునీకరిస్తున్నామన్నారు. ఇప్పటికే కాలేజీ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.166కోట్లను మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్​బచ్చు విజయ్​కుమార్, కార్పొరేటర్​కర్నాటి క్రిష్ణ, బీజీ క్లెమెంట్, కాలేజీ బృందం పాల్గొన్నారు.  

ఫాకో సెంటర్​ ప్రారంభం...

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుప్రతిలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఆపరేషన్లు చేసేందుకు రూ.28లక్షలతో ఏర్పాటు చేసిన ఫాకో మెషిన్​ను మంత్రి ప్రారంభించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. సూపరింటెండెంట్​డాక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, డాక్టర్​రామునాయక్, డాక్టర్​కేసగాని రాజశేఖర్, మేరి, నందగిరి శ్రీను ఉన్నారు.