హైదరాబాద్ సిటీలో క్లౌడ్ బరస్ట్.. సిటీ మొత్తం వర్ష బీభత్సం.. రంగంలోకి హైడ్రా, GHMC

హైదరాబాద్ సిటీలో క్లౌడ్ బరస్ట్.. సిటీ మొత్తం వర్ష బీభత్సం.. రంగంలోకి హైడ్రా, GHMC

హైదరాబాద్‎లో కుండపోత వర్షం కురుస్తోంది. దాదాపు అరగంట నుంచి రికార్డ్ స్థాయిలో వాన పడుతోంది. సిటీ మొత్తాన్ని నల్లటి మబ్బులు కమ్మేశాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‎కి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. మరో రెండు గంటల పాటు హైదరాబాద్‎లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించింది. 

సిటీలో ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన కుండపోత వర్షం పడుతుండటంతో నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరద నీరు రోడ్లపైకి చేరడంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వర్ష బీభత్సానికి నగరంలోని కొన్ని ప్రాంతాలు కరెంట్ లేక అంధకారంగా మారాయి.

 డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లుతుండటంతో బస్తీ వాసులు, లోతట్టు ప్రాంత ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆఫీసుల నుంచి సరిగ్గా ఇండ్లకు వెళ్లే సమయంలో వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. సిటీలో అల్లకల్లోలం సృష్టిస్తుండటంతో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎస్ బృందాలు అప్రమత్తమై రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 

 

  • హైదరాబాద్ సిటీలోని  జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, ఎల్బీనగర్, నాగోలు, హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్ పూర్ మెట్ ఏరియాల్లో భారీ వర్షంతో రోడ్లపై నీళ్లు పారుతున్నాయి.
  • ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పటం లేదు వాహనదారులకు.
  • పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, ఐకియా ఏరియాల్లో ట్రాఫిక్ నిదానంగా సాగుతుంది.
  • దిల్ షుఖ్ నగర్, మలక్ పేట్, అత్తాపూర్, కొత్తపేట, చంపాపేట ఏరియాల్లో వర్షం భారీగా పడుతుంది. 
  • సాయంత్రం మొదలైన వర్షం అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ.
  • హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏరియాలోనూ భారీ వర్షంతో.. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు వచ్చాయి. సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, కాంచన్ బాగ్, షాలిబండ, ఛత్రినాక, సికింద్రాబాద్, కంటోన్మెంట్ ఏరియాల్లోనూ వర్షం భారీగా పడుతుండటంతో.. రోడ్లపై నీళ్లు ఉండటంతో.. వాహనదారులు ఎక్కడికక్కడ రోడ్ల పక్కన ఆగిపోయారు.

  •