సింగరేణిలో లక్షా 20 వేలున్న ఉద్యోగులను 40 వేలకు తీసుకువచ్చిన్రు : భట్టి విక్రమార్క

సింగరేణిలో లక్షా 20 వేలున్న ఉద్యోగులను  40 వేలకు తీసుకువచ్చిన్రు : భట్టి విక్రమార్క

తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులను ముంచారు
సింగరేణిలో ప్రైవేటీకరణకు కేసీఆర్ సర్కార్  వేగం పెంచింది : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

సింగరేణిలో లక్షా 20 వేల ఉద్యోగులున్న వారి సంఖ్యను 40 వేలకు తీసుకువచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని అనుకున్న నిరుద్యోగులను సీఎం కేసీఆర్ నిండా ముంచారన్నారు. పెద్దపల్లి జిల్లా పీపుల్స్ మార్చ్ జోడో యాత్రలో సమావేశం నిర్వహించిన సీఎల్ పీ నేత భట్టి విక్రమార్క... ఉద్యోగాల పేరుతో సీఎం దోపిడి రాజ్యం నడిపిస్తున్నారని నిప్పులు చెరిగారు. సింగరేణిలో ప్రైవేటీకరణకు కేసీఆర్ సర్కార్  వేగం పెంచిందని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ఆయన తెలిపారు.  

ఓపెన్ కాస్ట్ లకు వ్యతిరేకం అంటూనే.. గోదావరిఖని నగరం నడిబొడ్డున ఓపెన్ కాస్ట్ ప్రారంభించారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేలకు అక్రమ దందాలపై ఉన్న  శ్రద్ద అభివృద్ధి మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీపీఎల్ విద్యుత్ ప్లాంటు నిర్మాణం కోసం సేకరించిన 1200 ఎకరాలు తిరిగి రైతులకు ఇవ్వాలని.. లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.