ఈ నత్త విషంతో 20 మందిని చంపొచ్చట!

ఈ నత్త విషంతో 20 మందిని చంపొచ్చట!

చెరువులు, నదులు, సముద్ర తీరాల్లో నత్తలను చూసే ఉంటారు. సమారుగా నాలుగు ఇంచుల పొడవు ఉండే ఈ కీటకాన్ని అందరూ లైట్ తీస్కుంటారు. కానీ నత్తతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటారా.. అసలు విషయంలోకి వస్తే.. ఇండోనేషియాలోని బాలిలోని ఓ బీచ్‌లో ఒక భయకంరమైన నత్తను మహిళ కనుగొంది. ఈ నత్తను చేత్తో పట్టుకొని సదరు మహిళ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న నత్త విషం చాలా ప్రమాదకరమని, దాని విషంతో 20 మందికి పైగా మనుషులను చంపే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ రకం నత్త వల్ల చాలా మంది ప్రమాదానికి గురయ్యారని సమాచారం. కానీ వీటి విషానికి ఇంత పవర్ ఉందని, ఈ రకం నత్త కుడితే చనిపోయేంత డేంజర్ అని ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలియదట. ఈ రకం నత్త కుట్టడం వల్ల శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులతోపాటు పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. వికారం, దృష్టి లోపం, కంటి చూపు కోల్పోవడంతోపాటు కండరాలు తిమ్మిరి పట్టేయడం లాంటివి కూడా సంభవిస్తాయని పరిశోధకులు అంటున్నారు.