సీఎం సహాయనిధి నుంచి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు

సీఎం సహాయనిధి నుంచి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు

మహారాష్ట్ర లోని అమరావతి జిల్లాలోని రెండు గ్రామాల్లో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన వారికి ప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందించాలని ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం.. అమరావతి కలెక్టర్‌కు ఫోన్ చేసి, బాధితలకు వీలైనంత త్వరగా వైద్యం అందించాలని, అవసరమైతే వారిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చాలని ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు అందజేస్తామని తెలిపారు. కలుషిత నీటిని తాగి 50 మంది అస్వస్థతకు గురయ్యారని, వీరిలో ముగ్గురు మరణించినట్టుగా జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి తెలిపారు. బాధితులు డయేరియాతో బాధపడుతున్నారని, ఇందులో కొందరి పరిస్థితి విషమంగా సీఎంకు తెలిపారు.  బాధితులు అమరావతి జిల్లాలోని పచ్చదొంగరి, కోయిలారి గ్రామాలకు చెందినవారు.