
ఒక్కో జిల్లాలో ఒక్కో మంత్రి జాతీయ పతాకావిష్కరణ
ఎల్లుండి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
విజయవాడ: ఎల్లుండి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గౌరవ వందనం స్వీకరించే మంత్రుల జాబితా ఖరారు చేశారు. సీఎం జగన్ కృష్ణా జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ మేరకు సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీలో 3 రాజధానుల నిర్ణయం.. అమరావతి నుండి రాజధాని తరలింపు పై హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న నేపధ్యంలో సీఎం జగన్ కృష్ణా జిల్లాలో నే పతాకావిష్కరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు 13 జిల్లాల్లో గౌరవవందనం స్వీకరించే ఉప ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన విభాగం జారీ చేసింది.
కృష్ణా జిల్లా – సీఎం జగన్
శ్రీకాకుళం – కొడాలి వెంకటేశ్వరరావు
విజయనగరం – వెల్లంపల్లి శ్రీనివాసరావు
విశాఖపట్టణం -కురసాల కన్నబాబు
తూర్పు గోదావరి -ధర్మాన కృష్ణదాస్
పశ్చిమ గోదావరి – పేర్ని వెంకటరామయ్య
గుంటూరు – చెరుకువాడ శ్రీరంగనాధరాజు
ప్రకాశం జిల్లా -బుగ్గన రాజేంద్రనాథరెడ్డి
నెల్లూరు -బాలినేని శ్రీనివాసరెడ్డి
కర్నూలు -పి.అనిల్ కుమార్
కడప -ఆదిమూలపు సురేష్
అనంతపురం -బొత్స సత్యనారాయణ
చిత్తూరు -మేకపాటి గౌతమ్ రెడ్డి