రేపు కేసీఆర్ తో జగన్ భేటీ

రేపు కేసీఆర్ తో జగన్ భేటీ

తెలుగు రాష్ట్రాల  సీఎంలు  రేపు భేటీ  కాబోతున్నారు.  కేసీఆర్ క్యాంప్  కార్యాలయంలో ఈ సమావేశం  జరగబోతోంది. ఇద్దరు  సీఎంల మధ్య  అధికారికంగా  జరగబోతున్న భేటీ  ఇదే కావడంతో  అందరిలోనూ  ఆసక్తి కనబడుతోంది.  ఇంతకుముందు  తన ప్రమాణ  స్వీకారానికి  ఆహ్వానించడానికి  కేసీఆర్ ను  కలిశారు జగన్. ఆ తర్వాత  మళ్లీ ఇప్పుడే  భేటీ అవుతున్నారు  ఇద్దరు సీఎంలు.

జగన్  సీఎం అయ్యాక  రెండు రాష్ట్రాల  మధ్య  ఇచ్చిపుచ్చుకునే  ధోరణి మొదలైంది. ఇందులో  భాగంగానే  సెక్రటేరియట్ లోని ….ఏపీ భవనాలను  తెలంగాణకు ఇస్తూ నిర్ణయం  తీసుకుంది  ఏపీ ప్రభుత్వం. భవనాల  అప్పగింత కూడా  పూర్తయింది. తర్వాత  ఆ బిల్డింగులకు  సంబంధించి విద్యుత్,  నీటి బిల్లుల  బకాయిలు రద్దు చేస్తూ  రాష్ట్ర  ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. వీటికి  బదులుగా  ఆదర్శ్ నగర్ లోని  హెర్మిటెజ్ భవనాన్ని  ఏపీ కి  ఇచ్చింది  కేసీఆర్ ప్రభుత్వం.

అయితే రాష్ట్ర  విభజన  జరిగినప్పటి  నుంచి  రెండు రాష్ట్రాల  మధ్య  పెండింగ్ ఇష్యూలు చాలా ఉన్నాయి.  భవనాల అప్పగింత  పూర్తయినప్పటికీ..  ఇంకా చాలా  విషయాలపై క్లారిటీ  రావాల్సి ఉంది.  నదీ జలాలు,  నీటి వాటాల  పంపిణీ, తొమ్మిది పదో షెడ్యూళ్లలోని  సంస్థల ఆస్తులు,  అప్పుల  పంపిణీ, విద్యుత్  సంస్థల  బకాయిలు, ఉద్యోగుల  విభజన అంశాలు  ఇంకా తేలలేదు.  వీటిపై  ఇద్దరు సీఎంలు  మాట్లాడుకునే అవకాశం ఉంది.

విభజన  చట్టంలో  తొమ్మి ది, పదో  షెడ్యూళ్లలోని  కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ  సంస్థల ఆస్తులు,  అప్పుల పంపిణీ  ఇప్పటికీ  పూర్తి కాలేదు. షీలాభిడే  కమిటీ  సిఫార్సు లపై  రెండు  రాష్ట్రాలు …తలో వాదన ముందుపెట్టాయి.  తొమ్మి దో   షెడ్యూల్ లో ని …91 సంస్థల్లో   72 సంస్థలపై  కమిటీ మార్గదర్శకాలు  ఇచ్చింది. ఇప్పుడా కమిటీ మార్గదర్శకాలను   పక్కనపెట్టి..తెలుగు  రాష్ట్రాలు సామరస్యం గా  ఆ సంస్థలను పంచుకోవడంపై  ఫోకస్ పెట్టాయి.