సిద్దిపేట జిల్లా పరిధిలో విమానాశ్రయం

సిద్దిపేట జిల్లా పరిధిలో విమానాశ్రయం

సిద్ధిపేటలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా పర్యటిస్తున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ నుంచి బయల్దేరి ఉదయం పదకొండున్నరకు సిద్దిపేట దగ్గర్లోని దుద్దెడ గ్రామం.. నాగులబండకు చేరుకున్నారు. అక్కడ ఐటీ టవర్ కు శంకుస్థాపన చేశారు. ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు, ఆంట్రప్రెన్యూర్లతో చర్చించారు. ఈసందర్భంగా  పారిశ్రామికవేత్తలకు శుభాభినందనలు తెలిపిన సీఎం.. ఐటీ రంగంలో సిద్దిపేట పురోగతి సాధిస్తుందన్నారు. రాష్ట్ర రాజధానికి సిద్దిపేట అత్యంత సమీపంలో ఉందన్నారు. సిద్దిపేట అత్యంత క్రియాశీలక ప్రాంతమని, అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. భవిష్యత్ ‌లో సిద్దిపేట జిల్లా పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం రానుందని చెప్పారు.

ఆ తర్వాత.. సిద్దిపేట శివారులోని పొన్నాల గ్రామంలో తెలంగాణ భవన్ బిల్డింగ్ ను ప్రారంభించారు. అక్కడినుంచి మిట్టపల్లి వెళ్లి రైతు వేదికను ప్రారంభించారు. ఆ తర్వాత సిద్ధిపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రారంభించారు సీఎం. వంద పడకల హాస్పిటల్ కు శంకుస్థాపన చేశారు. తర్వాత.. కోమటిచెరువుకు చేరుకున్నారు సీఎం కేసీఆర్. నెక్లెస్ రోడ్డును పరిశీలిస్తున్నారు.