నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

నిమ్స్‌ ఆసుపత్రి విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆరుగురు గర్భిణులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేశారు. మొత్తం 33 ఎకరాల్లో నిమ్స్‌ విస్తరణ పనులు చేపట్టనున్నారు. రూ. 1571 కోట్ల వ్యయంతో నిమ్స్‌లో 2 వేల పడకలతో కొత్త బ్లాక్‌ను నిర్మించనున్నారు.  నూతన భవన సముదాయంలో మొత్తం 4 బ్లాక్​లను అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త బిల్డింగ్ లోఅందుబాటులోకి వచ్చే పడకలతో కలిపి నిమ్స్​లో బెడ్స్ సంఖ్య 4000కి చేరనున్నాయి.  ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాక్‌లు ఏర్పాటుకానున్నాయి. కొత్త భవనంలో ప్రత్యేకంగా ఓపీ సేవల కోసమే ఒక బ్లాక్‌ను ఏర్పాటు కానుంది.  భవిష్యత్తులో పెరుగనున్న రద్దీ, విస్తృతం కానున్న స్పెషాలిటీ సేవలను దృష్టిలో పెట్టుకొని ఏకంగా 8 అంతస్థుల్లో ఓపీ బ్లాక్‌ను నిర్మించనున్నారు. ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేకంగా 8 అంతస్థులతో బ్లాక్‌ను నిర్మిస్తున్నారు. ఇన్‌పేషంట్ల కోసం 13 అంతస్థులతో మరో బ్లాక్‌ ఏర్పాటు చేయనున్నారు.

కొత్త భవనంలో మొత్తం 30 ఆపరేషన్‌ థియేటర్లు ఉండనున్నాయి. 2 వేల పడకలు అందుబాటులోకి వస్తుండగా అన్నింటికీ ఆక్సిజన్‌ సరఫరా ఉంటుంది. ఇందులో 1,200 ఆక్సిజన్‌ బెడ్లు, 500 ఐసీయూ బెడ్లు ఉంటాయి. ప్రత్యేక గది కావాలనుకునే రోగుల కోసం కొత్తగా పేయింగ్‌ రూమ్స్‌ సేవలను అందుబాటులోకి తేనున్నారు. 300 గదులు ఇందుకోసం కేటాయిస్తారు. ప్రస్తుతం నిమ్స్ లో  30 విభాగాలు ఉండగా.. విస్తరణతో వీటి సంఖ్య 35కు పెరుగనుందిది.