
తిరువనంతపురంలోని క్లిఫ్ హౌస్ లో కేరళ సీఎం పినరయి విజయన్ తో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. లోక్ సభ ఎన్నికలు, ఫలితాలు, దేశ రాజకీయాలపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ఉన్నారు.
కేరళ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. సాయంత్రం అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. కేరళ నుంచి తమిళనాడు వెళ్లనున్న సీఎం కేసీఆర్.. రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను సందర్శిస్తారు. ఈ నెల 13న మరోసారి తమిళనాడు వెళ్లనున్న కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరపనున్నారు.