
ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రపంచమంతా ఆందోళనలో ఉంటుంటే పనికిమాలిన దుర్మార్గులు మాత్రం ఫేక్ న్యూస్ తో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు సీఎం కేసీఆర్. ఆదివారం లాక్ డౌన్ పై మాట్లాడిన సీఎం కేసీఆర్.. కరోనా అలాంటి దుర్మార్గులకు సోకాలన్నారు.
ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారు ఎంతటివారైనా పట్టుకుంటామని కఠిన చర్యలు తప్పవన్నారు. ఇష్టం వచ్చినట్లు ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సర్పంచ్ లు చిల్లర వేషాలేస్తే కరోనా వస్తది
ప్రతి గ్రామానికి సర్పంచ్ కథానాయకుడు కావాలన్న సీఎం.. బియ్యం, డబ్బుల పంపిణీ విషయంలో చిల్లర వేషాలేస్తే కరోనా వస్తదని తెలిపారు. ఆపద సమయాల్లోనూ కక్కుర్తి పడొద్దని శవాల మీద పేలాలు ఏరుకునేలా ఉండకూడదన్నారు. ప్రజలకు కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పిచాలని సర్పంచ్ లను ఉద్దేశించి మాట్లాడారు సీఎం కేసీఆర్.