కొత్త మున్సిపల్ చట్టం పై అధికారుల తో కేసీఆర్ సమీక్ష

కొత్త మున్సిపల్ చట్టం పై అధికారుల తో కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : కొత్త మున్సిపల్ చట్టంపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు… అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్త చట్టం ఉండాలని అధికారులకు సూచించారు. అధికారాలు, బాధ్యతలు ఎలా ఉండాలనే అంశాలపై కీలక సూచనలు చేశారు. శుక్రవారం ప్రగతిభవన్‌ లో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.

ప్రస్తుతం మున్సిపల్ చట్టం లో GHMC కి ఒక చట్టం, మున్సిపల్ కార్పొరేషన్ కు ఒక చట్టం, మున్సిపాలిటీ లకు మరో చట్టం ఇలా మూడు చట్టాలు ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి ఒక కొత్త చట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది… ఇందులో భాగంగానే కొత్త చట్టం పై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష చేస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.