V6 News

నూతనంగా పటేల్  పెరల్స్ వెంచర్ ప్రారంభం

నూతనంగా పటేల్  పెరల్స్ వెంచర్ ప్రారంభం

సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేట జిల్లా కేంద్రం కలెక్టరేట్  సమీపంలో నూతన పటేల్ పెరల్స్ వెంచర్ ను బ్రోచర్ ను, ఏఐసీసీ  సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇటువంటి వెంచర్లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ వెంచర్ ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన వసతులు అందించడంతో పాటు పట్టణానికి కొత్త గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని వెల్లడించారు.

అభివృద్ధి దిశగా ప్రైవేట్ రంగం కూడా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి కుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్స్ తన్వీర్ హుస్సేన్, కొండపల్లి దిలీప్ రెడ్డి, ఎండీ తమ్మినేని గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.