V6 News

ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్ల రిపేర్లకు ‘ఎస్పీఎం’ సాంకేతికతను వాడాలి  :  సీఎండీ జితేశ్ వి పాటిల్

ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్ల రిపేర్లకు ‘ఎస్పీఎం’ సాంకేతికతను వాడాలి  :  సీఎండీ జితేశ్ వి పాటిల్

కల్వకుర్తి, వెలుగు : విద్యుత్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ ఫార్మర్ల రిపేర్ల కోసం నూతన ‘ఎస్పీఎం’ సాంకేతిక పద్ధతిని వినియోగించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ సీఎండీ జితేశ్​ వి పాటిల్ అధికారులకు సూచించారు. మంగళవారం కల్వకుర్తిలో ఆయన పర్యటించారు. అక్కడి 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు రిపేర్లకు గురైనప్పుడు రైతులకు ఇబ్బంది కలగకుండా, వేగంగా వాటిని పునరుద్ధరించేందుకు ఆధునిక సాంకేతికత ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు కల్వకుర్తి మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ రత్నమాల ఆనంద్ కుమార్ కౌన్సిలర్లతో కలిసి పట్టణంలోని విద్యుత్ సమస్యలపై సీఎండీకి వినతి పత్రం సమర్పించారు.