హాలియా, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్, బి. అయోధ్య రెడ్డి మంగళవారం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరికి మిర్యాలగూడ ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు సాగర్ జలాశయంలో లాంచీ ప్రయాణం చేసి, బుద్ధవనంలోని బుద్ధ పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. బుద్ధ చరిత వనం, ధ్యానవనం, స్థూప వనాలను సందర్శించిన అనంతరం మహాస్తూపంలో బుద్ధవన విశేషాలపై రూపొందించిన లఘుచిత్రాన్ని వీక్షించారు.

