V6 News

మంచిర్యాల జిల్లా తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

మంచిర్యాల జిల్లా తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

బెల్లంపల్లి రూరల్, వెలుగు: తన భూమిని వేరే వ్యక్తుల పేరిట పట్టా చేశారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా భీమిని తహసీల్దార్​ ఆఫీస్​ ఆవరణలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని చిన్నగుడిపేటకు చెందిన రెడ్డి స్వామి సర్వే నంబర్​ 107లో ఉన్న భూమిని తాను కాస్తు చేస్తున్నప్పటికీ, ఆ భూమిని మరొకరికి పట్టా చేశారని వాపోయాడు. 

తన వెంట పురుగుల మందు డబ్బా తెచ్చుకున్న బాధితుడు భార్య, పిల్లలతో కలిసి తాగేందుకు యత్నించాడు. ఎస్సై కోటేశ్వర్​ సిబ్బందితో అక్కడికి చేరుకొని పురుగుల మందు డబ్బాను లాక్కొన్నారు. అనంతరం బాధితుడు తనను మోసం చేసిన ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.