
రైతుబంధు పథకం యథావిధిగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇతర పంటలు వేసేలా రైతుల్లో చైతన్యం తేవాలని సూచించారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన TRS విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ధాన్యం కొనుగోళ్లు, గనుల ప్రైవేటీకరణ, ఇతర అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. దళితబంధుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని.. విపక్షాల ప్రచారం తిప్పికొట్టాన్నారు. ఈ పథకాన్ని దశల వారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని, కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిపించుకునే బాధ్యత తనదే అని కేసీఆర్ తెలిపారు.