చప్పట్లు, సీటీలు కొట్టుడు కాదు.. పనిచేయాలి

చప్పట్లు, సీటీలు కొట్టుడు కాదు.. పనిచేయాలి

సీఎం కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో పర్యటిస్తున్నారు. ముందుగా గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకొని గ్రామస్తులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతుండగా.. గ్రామస్తులు పెద్ద ఎత్తున చప్పట్లు, సీటీలు కొట్టారు. వెంటనే కేసీఆర్ కల్పించుకొని.. చప్పట్లు కొట్టుడు కాదు.. పనిచేయాలి అని సూచించారు. సీటీలు కొట్టడానికి నేనేమన్న యాక్టర్‌నా అని అన్నారు. వాసాలమర్రిని బంగారు వాసాలమర్రి చేద్దాంమని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.