దేశంలో దుర్మార్గ‌మైన ప‌నులు జ‌రుగుతున్నాయి

దేశంలో దుర్మార్గ‌మైన ప‌నులు జ‌రుగుతున్నాయి

జాతీయ రాజ‌కీయాలు ప్ర‌భావం చేసేలా ముందుకు సాగుతున్నాన‌న్నారు కేసీఆర్. దేశాన్ని సెట్ రైట్ చేయడానికి ముందుకు పోతా అన్నారు. కొంద‌రు నాయ‌కులు ఇక్క‌డ‌కి వ‌చ్చి రెచ్చగొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నార‌న్నారు. సోష‌ల్ మీడియాలో చిల్ల‌ర ప్ర‌చారాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.హైద‌రాబాద్ లో మ‌త క‌ల్లోలాలు జ‌రుగుతాయ‌ని ప్ర‌చారం చేశార‌న్నారు.   దేశం కూడా దారి త‌ప్పుతోంద‌న్నారు గులాబీ బాస్. దేశంలో దుర్మార్గ‌మైన ప‌నులు జ‌రుగుతున్నాయ‌న్నారు. క‌ర్నాట‌క‌లో మ‌త‌క‌ల్లోలాలు లేపార‌ని ఆరోపించారు సీఎం. ఎక్క‌డిక‌క్క‌డ మ‌త క్యాన్స‌ర్ వ్యాపించ‌కుండా క‌ట్ట‌డి క‌ట్ట‌డి చేయాలని పిలుపు నిచ్చారు సీఎం.

దేశంలో అతి త‌క్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. మ‌న రాష్ట్ర అభివృద్ది చూసి మ‌హారాష్ట్ర సీఎం ఆశ్చ‌ర్య పోయార‌న్నారు. ఏడేళ్ల కిందట తెలంగాణ ఎలా ఉండే ఇప్పుడెలా ఉంది?  అంటూ ప్ర‌శ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో, ఏపీలో ఉన్న పరిస్థితులేంటి? అంటూ ప్ర‌జ‌ల్ని ఉద్దేశించి సీఎం ప్ర‌సంగించారు. పంజాబ్‌తో పోటీ పడుతూ ధాన్యం పండిస్తున్నామ‌న్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు ఇస్తున్నామ‌న్నారు. తెలంగాణ రైతులు కాలర్‌ ఎగరేసి బతుకుతున్నారన్నారు కేసీఆర్. 
అద్భుతమైన గ్రామీణ తెలంగాణ ఆవిష్కరణ అవుతోందన్నారు. మత్స్యపరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతోందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతోందని కేసీఆర్ తెలిపారు. 

కేంద్రం సహకారం లేకున్నా అభివృద్ధిలో ముందున్నామ‌న్నారు. దేశాన్నే మార్గదర్శనం చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. పిడికెడు మందితో బయల్దేరితే తెలంగాణ సాకారమైందన్నారు. మిషన్‌భగీరథ దేశంలోనే ఎక్కడా లేదన్నారు గులాబీ బాస్.

ఇవి కూడా చ‌ద‌వండిః

మల్లన్నసాగర్ లోకి నీటిని విడుదల చేసిన కేసీఆర్

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహిళలు వెన్నెముక‌